Rashmika mandhan as a TeLanGana lady cricketer in a new movie 😍👈 with telangana slang

వరుస సక్సెస్ లతో గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రం లో నటిస్తుంది. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక పాత్ర పేరు లిల్లి అని ఆమె తెలంగాణ మహిళా క్రికెటర్ గా ఈ చిత్రంలో కనిపించనుందని సమాచారం. అంతేకాకుండా ఈచిత్రంలో రష్మిక తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుందట. ఇక ఈ పాత్ర కోసం మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దగ్గర క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక విజయ్ మాత్రం ఈచిత్రంలో స్టూడెంట్ గా కనిపించనున్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This is
Bhuwan Reddy
Signing out
Thank you

Comments

Popular posts from this blog